వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

వేయి స్తంభాల గుడి  పునర్నిర్మాణ పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

వరంగల్: వేయి స్తంభాల గుడి  పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరంగల్ కు చారిత్రకంగా మంచి పేరు తీసుకొచ్చిన వేయి స్తంభాల గుడిని తిరిగి అదే స్థాయిలో పునర్నిర్మాణం చేయాలని చెప్పారు. ఇప్పటికే వివిధ సాంకేతిక కారణాలతో ఆలస్యం జరిగిందని, ఇక ముందు అలా జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2023 మార్చి 31లోగా  గుడి పనులన్నీ పూర్తి చేయాలని  ఆదేశించారు.

వేయి స్తంభాల గుడితో పాటు వరంగల్ కోట, జైన మందిరాలపై కూడా దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, కుడా అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.